Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాద ఘటనపై స్పందించారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో నివసిస్తున్న విషయం తెలిసిందే. ఇలా సింగపూర్లో చదువుతున్నటువంటి ఈ చిన్నారి పాఠశాలలో అనుకోకుండా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా పాఠశాలలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడమే కాకుండా దట్టమైనటువంటి పొగ కూడా కమ్ముకున్నాయి.
ఇకపోతే ఈ పాఠశాలలో చదువుతున్న చిన్నారి మార్క్ శంకర్ కూడా ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారని విషయం తెలిసిందే ఈ ప్రమాదంలో భాగంగా చేతులు కాలపై స్వల్ప గాయాలు అయినట్లు వెల్లడించారు .ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇక చిన్నారి మార్క్ శంకర్ ఆరోగ్యం పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మార్క్ శంకర్ చేతులకు కాళ్లకు స్వల్ప గాయాలు తగిలాయని ప్రస్తుతం తన పరిస్థితి బాగుందని ఈయన తెలియజేశారు. ఇకపోతే చిన్నారికి ఇలాంటి ఘటన జరిగింది అనే విషయం తెలిసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే మాజీ మంత్రి రోజా సైతం చిన్నారి క్షేమంగా కోలుకోవాలని మంచి ఆరోగ్యంతో ఉండాలి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ సైతం మన్యం జిల్లాలలో పర్యటన చేపట్టారు నిన్న నేడు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తన కొడుకు విషయం తెలియగానే తన పర్యటనను పూర్తిగా ముగించుకొని సింగపూర్ వెళ్లారు.
