Y.S.Jagan:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిన్నారి చదువుతున్నటువంటి పాఠశాలలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది ఈ అగ్ని ప్రమాదం కారణంగా చిన్నారి మార్క్ శంకర్ గాయాలు పాలయ్యారు.
అగ్నిప్రమాదంలో చిక్కుకున్న మార్కు శంకర్ చేతులు కాళ్లకు గాయాలు అయ్యాయని ఊపిరితిత్తుల లోకి పొగ వెళ్లడంతో కాస్త అస్వస్థతకు గురి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నారి సింగపూర్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది. ఇలా చిన్నారి మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యారనే విషయం తెలియడంతో మెగా అభిమానులు జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రమాద ఘటన పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ…మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు.. సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాక్ అయినట్లు వివరించారు. ప్రస్తుతం జగన్ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతుంది.
ఇక ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు రాజకీయ నాయకులు కూడా స్పందించారు నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చిన్నారి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాల పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ జిల్లా పర్యటన పూర్తి కాగానే ఆయన సరాసరి సింగపూర్ వెళ్ళనున్నట్టు తెలుస్తుంది.