Allu Arjun – Atlee: బన్నీ – అట్లీ.. ఆ సంస్థతో అంటే గ్రాఫిక్స్ గట్టిగానే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కలయికపై టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో సాలీడ్ హైప్ ఉంది. ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా ‘AA22’ వర్కింగ్ టైటిల్ తో ప్రీ-ప్రొడక్షన్ లో ఉంది. తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ‘లొలా VFX’ని అల్లు అర్జున్, అట్లీ కలిసి సందర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బన్నీ అట్లీ కలిసి అటు స్టూడియోలోని వర్క్‌ని గమనించడంతో ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్థాయి సినిమాలకు పని చేసిన సంస్థ.

లొలా వీఎఫ్‌ఎక్స్ అవెంజర్స్: ఎండ్ గేమ్, కెప్టెన్ అమెరికా, హ్యారీ పోటర్ లాంటి హాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాలకు పని చేసింది. ఇండియాలో కూడా కల్కి 2898 AD, GOAT, ఇండియన్ 3 సినిమాలకి ఈ సంస్థ సేవలు అందించింది. అలాంటి కంపెనీని బన్నీ, అట్లీ కలిసి వెళ్లి పనితీరును గమనించడం చూస్తే, ఈ సినిమా కోసం ఎంతలా కేర్ తీసుకుంటున్నారో తెలుస్తోంది. ఇది కేవలం కమర్షియల్ మూవీ కాదు, అందరికీ గుర్తుండిపోయేలా ఉండే సినిమా కావాలని భావిస్తున్నారు.

ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ షేడ్స్‌తో కనిపించబోతున్నాడని టాక్. బహుశా రెండు వేర్వేరు వయసుల పాత్రలు ఉండే అవకాశం ఉందని వినిపిస్తోంది. అలాంటి సబ్జెక్ట్‌కు లొలా వీఎఫ్‌ఎక్స్ పనితీరు చాలా కీలకం అవుతుంది. ముఖ్యంగా డిజిటల్ డీ-ఏజింగ్, ఫేస్ రీప్లేస్‌మెంట్ లాంటి హై టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఫ్యాన్స్ అయితే “ఇది పుష్ప రేంజ్ కాదు… హాలీవుడ్ లెవెల్ ప్రాజెక్ట్” అంటూ సోషల్ మీడియాలో ఫైట్ మొదలుపెట్టారు.

ఇప్పుడు బన్నీ అమెరికాలో స్టూడియోలకు వెళ్లడం, VFX గురించి స్వయంగా డిస్కస్ చేయడం చూస్తే ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ వివరాలు త్వరలో అధికారికంగా వస్తాయని టాక్. కానీ ఇప్పటిదాకా బయటకి వచ్చిన విషయాలు చూస్తే ఈ సినిమా తెలుగు సినిమాకే గర్వకారణంగా మారే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ అట్లీ కలయికతో మాస్‌తో పాటు టెక్నికల్ గానే ఒక కొత్త బెంచ్ మార్క్ రావొచ్చు.

అంబానీ ఇల్లు కూల్చివేత || Journalist Bharadwaj About Mukesh Ambani House Antilia || Waqf Bill || TR