Pawan Kalyan: ఏపీలో మరో 15 ఏళ్లు కూటమే ఉంటుంది… ధీమా వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా మన్యం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అభివృద్ధిలో వెనుకబడిన గిరిజన ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించడం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గిరి పుత్రులకు ఇకపై డోలి అవసరం ఉండకూడదనీ రోడ్లు వేయటానికి శ్రీకారం చుట్టారు.

ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వంపై కూడా ఈయన విమర్శలు చేశారు మన్యం జిల్లాలలో ప్రజలు కూటమికి ఓట్లు వేయలేదు కానీ మేము వాటి గురించి ఆలోచించకుండా ఇక్కడ గ్రామాలను అభివృద్ధి చేయటం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

మీరు మాకు ఓట్లు వేయకపోయినా మేము మీకు విలువ ఇస్తున్నాం కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు వైసీపీకి ఓట్లు వేసి ఎంతో విలువ ఇచ్చారు కానీ వాళ్ళు మాత్రం మీకు విలువ ఇవ్వలేదని తెలిపారు. వచ్చే ఎన్నికలలో మాత్రం మీరంతా కూటమి ప్రభుత్వానికి తప్పకుండా ఓట్లు వేయాలి అంటూ ఈయన తెలిపారు.

ఇక గత ప్రభుత్వ హయామంలో ఐదు సంవత్సరాలకు గాను కేవలం 92 కోట్ల రూపాయలతో 92 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలలకే 5000 కోట్ల రూపాయల పనులను మంజూరు చేసామని తెలిపారు.నేను పదే పదే చెబుతున్నా. 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.

కేంద్రంలో బీజేపీని లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ ఎలాగైతే చేశారో అంత బలంగా మూడు పర్యాయాలు ఉంటే తప్ప, విభజన సమయం నుంచి గత పాలన వరకు నలిగిపోయాం, అందులోంచి బయటపడాలంటే మాకు ఒక 15 సంవత్సరాలు మీ ఆశీస్సులు కావాలి. ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు సరి చేస్తున్నారు. మీ కోసం మేము పని చేస్తాం. మీ ఆశీస్సులు మాకు కావాలి. వచ్చే ఎన్నికలలో మీ ఓటు కూటమికే వేయాలి అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి.