Sri Reddy: ప్రముఖ సంచలన తార శ్రీరెడ్డి తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన ఆరోపణల కారణంగా ఇండస్ట్రీ ఈమె పై వేటు వేసింది. అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వచ్చారు.
ఇలా ఒక వైపు సినిమాల గురించి మాట్లాడుతూనే మరో వైపు వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండేవారు అయితే ఇటీవల కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో శ్రీ రెడ్డి చాలా వరకు మౌనం పాటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
నా జీవితం ప్రతిరోజు ఒక పోరాటమే అవుతుంది. ఇక ఓపిక నశించింది. ఎంతగానో అలసిపోయాను నా ఒక్కదాని వల్లే చిత్ర పరిశ్రమలో మార్పు రాదు కదా.. మూసలో ఉన్నవి. కొత్తగా వచ్చి మనం ఎవరం మార్చలేము. నా లాగా ఎదురించి ఎవరు మీ పేరు, జీవితం పాడుచేసుకోవద్దు. ఎవరిలో ఏ మార్పు రాదు ఓకేనా.. నా అనుకున్న వాళ్లు కూడా ఎవరినో స్ర్కాప్ ను ఎంకరేజ్ చేస్తారు. మనల్ని పక్కన పడేస్తారు. నా జీవితం మీ అందరికీ ఒక మంచి పాఠం లవ్ యూ ఆల్ అంటూ ఈమె పోస్ట్ చేశారు.
ఈ విధంగా శ్రీరెడ్డి తాను పోరాటం చేస్తూ జీవితం నాశనం చేసుకున్నానని తనలాగా ఎవరు చేసుకోవద్దు అంటూ చెబుతూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ పై నేటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఏంటి శ్రీరెడ్డి మద్యం మత్తులో ఈ పోస్ట్ చేసావా అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరికొందరు హే నువ్వు ఇంకా బయటే ఉన్నావా జైలుకు పోలేదా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.