Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు… గత ప్రభుత్వం మోసం చేసింది అంటూ?

Pawan Kalyan: ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవితల్లి బాట అంటూ రెండు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే నిన్న నేడు ఈయన మన్యం జిల్లాలలో పర్యటన చేశారు. ఇలా గిరిజన ప్రాంతాలకు కనీసం రోడ్లు సౌకర్యం కూడా లేకపోవడంతో రోడ్లు సౌకర్యాన్ని కల్పిస్తూ పవన్ కళ్యాణ్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు.

గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరికి 5000 రూపాయలు చొప్పున వేతనం చెల్లించేవారు కానీ కూటమినేతలు ఎన్నికలకు ముందు ఒక్కో వాలంటీర్ కు 10000 రూపాయలు జీతం చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా విధుల నుంచి తొలగించారు.

తాజాగా మన్యం జిల్లాలలో పర్యటన చేసిన పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు.మీరు ఏ విభాగం కిందకు వస్తారో.. జీతాలు ఎలా ఇచ్చారో చెప్పకుండానే వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని వంచించిందని చెప్పారు. వాలెంటీర్ అనే పదానికి అర్ధం ఏంటో కూడా తెలియదు.. ఆ విధంగా గత ప్రభుత్వం మోసం చేసింది.. అనేక సార్లు వాంటర్లపై చర్చించాం.. మరోసారి కేబినెట్ దృష్టికి తీసుకుని వెళతాను.. వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పాం.. కానీ వాలంటీర్లు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పని చేశారని తెలిపారు.

వాలంటీర్లకు సంబంధించి ఏ పేపర్ వర్క్ ప్రభుత్వం దగ్గర లేదు.. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా దాఖలాలే లేవు.. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి వాలంటీర్లను గత ప్రభుత్వం పెద్ద ఎత్తున మోసం చేసింది అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.