టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల పేరు ఈ మధ్య బీటౌన్ లో బాగా వినిపిస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, ఇందులో నటిస్తున్న మరో స్టార్ కార్తిక్ ఆర్యన్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం, ఇటీవల వైరల్ అయిన ఫొటోలు ఈ రూమర్లకు బలాన్నిచ్చాయి. ఇక కార్తిక్ తల్లి కూడా ఓ ఫంక్షన్‌లో తన కోడలు గురించి మాట్లాడినట్లు వార్తలు రావడంతో ఇద్దరి ప్రేమ బలంగా మారిందన్న అభిప్రాయాలు వినిపించాయి.
ఇంతలో శ్రీలీల ప్రేమపై ఓ చిట్ చాట్‌లో చేసిన కామెంట్స్ కూడా ఆసక్తిని రేపాయి. దీంతో నెటిజన్లు కార్తికే శ్రీలీల బాయ్‌ఫ్రెండ్ అని ఖాయం చేసేసారు. కానీ వీటన్నింటికి బ్రేక్ వేసేలా కార్తిక్ ఆర్యన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇండస్ట్రీలో తనకు ఎలాంటి గర్ల్‌ఫ్రెండ్ లేదని, తాను పూర్తి స్థాయిలో సోలోగా ఉన్నానని చెప్పారు. సినిమాల్లోని హీరోయిన్లతో తనకు స్నేహం మాత్రమే ఉందని తేల్చేశారు.
అంతేకాదు, ఇటీవల తనపై వచ్చిన 50 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపైనా స్పందించిన కార్తిక్, “ఇండస్ట్రీలో మల్టీ కోటి పారితోషికం తీసుకునే వారిలో నేను ఒక్కడినేనా?” అని ఎదురుప్రశ్నించారు. తనకు బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడమే ఇలాంటి రూమర్లకు కారణమని తెలిపారు. కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తారని, తమకు నచ్చని వారిని లక్ష్యంగా చేసుకుంటారని అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలతో శ్రీలీలపై ఓ ముక్క కూడా ప్రస్తావించకుండా, ఇండస్ట్రీలో గర్ల్‌ఫ్రెండ్ లేదన్న కార్తిక్ స్టేట్‌మెంట్ చర్చగా మారింది. వాస్తవానికి ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందన్నది ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా, నెటిజన్లు మాత్రం వీళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌లోనే ఉన్నారని గట్టిగా నమ్ముతున్నారు. మరి వీరి ప్రేమ కథలో నెక్ట్స్ ట్విస్ట్ ఏంటో వేచి చూడాలి.


