Nara Lokesh: మంగళగిరి.. 2019లో ఓటమి ఎదుర్కొన్నప్పటికీ, లోకేశ్ (Nara Lokesh) పట్టుదలతో అదే నియోజకవర్గం నుంచి 2024లో తిరిగి ఘన విజయం సాధించారు. గెలిచాక వేడుకలు కాకుండా, నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి లోకేశ్ మరింత శ్రద్ధ పెట్టారని అనిపిస్తోంది. బాలయ్యకు హిందూపురం – చంద్రబాబు (Chandrababu)కు కుప్పం ఎలాగో తనకు కూడా మంగళగిరి కంచుకోటలాగా ఏర్పడాలని లోకేష్ టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ప్రజల మధ్య ఉండటంతో పాటు, మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నారు.
Pawan Kalyan: స్మగ్లింగ్ పై పవన్ కల్యాణ్ అలజడి.. ద్వారంపూడి మీద చర్యలు ఉంటాయా?
తన మంత్రిత్వ విభాగాలను మరింత సమర్థవంతంగా నడిపించడమే కాకుండా, పారిశ్రామిక పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టీసీఎస్ వంటి కంపెనీలను విశాఖకు తీసుకురావడం ద్వారా 10 వేల మందికి ఉపాధి కల్పించారు. అలాగే అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించారు. విదేశీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆకర్షించేందుకు దావోస్‌లో పలు కీలక సమావేశాలు నిర్వహించి విజయవంతమయ్యారు.
లోకేశ్ (Nara Lokesh) తన పనితీరుతో ప్రజల విశ్వాసం గెలుచుకుంటున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ, పబ్లిక్‌కి అందుబాటులో ఉంటున్నారు. చిన్న సమస్యైనా, పెద్ద సమస్యైనా ఒకేలా చూసి త్వరగా పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు పెంచడం, పథకాల అమలు, విద్య, ఆరోగ్య రంగాల్లో మెరుగుదల వంటి కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. తన తండ్రి చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వంటి నాయకుల మధ్య లోకేశ్ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెలుగులోకి వస్తున్నారు.
డ్రగ్స్ కట్టడి కోసం ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయడం, MSME పాలసీ అమలు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వంలో కీలక కేంద్రంగా ఉండి, పారిశ్రామిక వేత్తలతో సంబంధాలు మెరుగుపరుచుకుని, అనేక రంగాల్లో అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని (Mangalagiri) అభివృద్ధి మోడల్‌గా నిలబెట్టేందుకు లోకేశ్ శ్రమిస్తున్నారు. పాదయాత్రలలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై కృషి చేస్తూ, రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదిస్తున్నారు. ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో లోకేష్ (Nara Lokesh) కు మంగళగిరి కచ్చితంగా కంచుకోటలాగా మారడం కాయం.