Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో మహేష్ బాబు ఒకరు. మహేష్ ఇప్పటివరకు ఒక పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటించలేదు కానీ ఈయనకు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ ఉంది. టికెట్ త్వరలోనే రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.
ఇక మహేష్ బాబు హీరోగా నటించడమే కాకుండా ఎంతోమంది హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇస్తూ వారికి సహాయం చేస్తూ ఉంటారు. అయితే తాజాగా మహేష్ బాబు హాలీవుడ్ సూపర్ హిట్ యానిమేషన్ మూవీ ‘ది లయన్ కింగ్’ కి సీక్వెల్‌గా రూపొందిన ‘ముఫాసా ది లయన్ కింగ్ సినిమాలో ముఫాసాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 20వ తేదీ విడుదల కానుంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్లను కూడా నిర్వహిస్తూ వచ్చారు..ముఫాసా ది లయన్ కింగ్ సినిమా తెలుగు వర్షన్ కోసం లీడ్ రోల్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన విషయం తెల్సిందే. ఇలా మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో ఈ ప్రమోషన్లలో భాగంగా మహేష్ బాబుతో పాటు ఆయన సతీమణి నమ్రత కుమార్తె సితార కూడా పాల్గొంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ముఫాసా ది లయన్ కింగ్ కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ముఫాసా ది లయన్ కింగ్ విడుదల కాబోతున్న విజయవాడ అప్సరా థియేటర్ వద్ద మహేష్ బాబు 40 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి అభిమానులు ఈ కటౌట్ కి పాలాభిషేకం చేశారు. సాధారణంగా హీరోలు నటించిన సినిమాలు విడుదల అయితేనే ఇలా పెద్ద ఎత్తున కటౌట్ ఏర్పాటు చేస్తూ అభిషేకాలు చేస్తూ ఉంటారు.
ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే మాత్రం ఆ హీరో కటౌట్స్ ఏర్పాటు చేయడం ఇప్పటివరకు చూడలేదు అయితే మొదటిసారి ఇలా 46 అడుగుల మహేష్ బాబు కటౌట్ ఏర్పాటు చేసి అభిమానులు అభిషేకాలు చేయడం చూస్తుంటే మహేష్ బాబుకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది.