ఎంటీవీలో ప్రసారం అయ్యే రోడీస్, స్ల్పిట్స్‌విల్లా లాంటి షోల ద్వారా పాపులర్ అయిన యాక్టర్, ప్రొడ్యూసర్ రఘురాం గురించి మీకు తెలుసా.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి విలన్ గా పేరు తెచ్చుకున్న రఘురాం గురించి మీకు తెలియకపోవచ్చు కానీ ఫోటో చూస్తే గుర్తుపడతారు. ఇతను శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. తమిళంతో పాటు ఇటీవల ‘కీడాకోలా’, ‘మెకానిక్ రాకీ’ తదిర తెలుగు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు రఘురామ్.
అయితే బాలీవుడ్ లో మాత్రం మంచి ఫేమ్ ని సంపాదించుకున్న రఘురామ్ ఎంటీవీలో తన కెరీర్ ప్రారంభించి రోడీస్ లాంటి, స్ల్పిట్స్‌విల్లా రూపొందించి నిర్మాతగా మారాడు. రఘురామ్ మన తెలుగు వాడే ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో పుట్టాడు. తండ్రి చార్టెడ్ అకౌంట్, తల్లి జర్నలిస్ట్. అయితే ఇతని భార్యని మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.
అంత అందంగా ఉంటుంది అతని భార్య. అంతే కాదు ఆమె ఒక పాపులర్ సింగర్ కూడా.ఆమే కెనడాకు చెందిన సింగర్ నటాలియా. ఈమెని నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు రఘురాం. ఈ మధ్యనే ఐదో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు ఈ జంట. ఈ సందర్భంగా తమ పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. వీటిని చూసిన వారంతా ఈ విలన్ కు ఇంత అందమైన భార్య ఉందా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
రఘురామ్‌కు ఇది రెండో వివాహం. గతంలో నటి సుగంధ గార్గ్‌ను పెళ్లాడిన అతడు 2016లో ఆమెతో విడిపోయారు. భార్యతో విడిపోయిన తర్వాత నటాలియో డి లూసీకి దగ్గరయిన ఈ ప్రొడ్యూసర్ కొంతకాలంగా ఆమెతో సహజీవనం చేశాడు . పలు బాలీవుడ్ సినిమాలకు పని చేసిన నటాలియా ఎంటీవీ స్టూడియోలో రఘుకు పరిచయం అయింది. అలా ఇద్దరి మధ్య మొదలైన ప్రేమ పెళ్లి చేసుకునే వరకు వచ్చింది.