ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోలు హిట్లు కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. షారుఖ్ ఖాన్ తప్ప సల్మాన్ ఖాన్ నుంచి అక్షయ్ కుమార్ వరకు అందరూ ఒక్క సక్సెస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. మన సౌత్ హీరోలు మాత్రం పాన్ ఇండియా పేరుతో బాలీవుడ్ బాక్స్ ఆఫీసులు బద్దలు కొడుతున్నారు. ముఖ్యంగా మన టాలీవుడ్ డైరెక్టర్లు మంచి చిత్రాలతో అలరిస్తున్నారు. అందుకే ధనుష్, దుల్కర్ సల్మాన్ వంటి ఇతర భాషల హీరోలు సైతం మన దర్శకులతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు.
ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఖాన్ త్రయం లో ఒకరైన అమీర్ ఖాన్ కూడా మన టాలీవుడ్ డైరెక్టర్స్ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.ప్రస్తుతం ఈ బాలీవుడ్ స్టార్ హీరో ‘సీతారే జమీన్ పర్’తో పాటు, ‘లాహోర్ 1947’ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అంతేకాదు, రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలి అనే తమిళ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర తో కలిసి నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.ఈ నేపథ్యంలోనే ‘ఊపిరి’, ‘మహర్షి’ , ‘వారిసు’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి ఆమిర్‌కు ఒక కథ వినిపించారట.
కథ నచ్చడంతో ఆమిర్ ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే వంశీ వినిపించిన కథ నచ్చి, సినిమా చేయడానికి ఆమిర్ అంగీకరించాడని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడట. దర్శకుడిగా వంశీ పైడిపల్లి ఆరు సినిమాలు తీస్తే.. అందులో ఐదు దిల్ రాజు బ్యానర్ లో చేసినవే.
ఇప్పుడు ఆయన మరోసారి దిల్ రాజుతో చేతులు కలపడం విశేషం. జనవరి చివరి వారంలో స్క్రిప్ట్‌పై తుది చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది.దిల్ రాజు తన సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారని టాక్. ‘జెర్సీ’ ‘హిట్’ రీమేక్‌లు దిల్ రాజుకు బాలీవుడ్‌లో అంతగా కలిసి రాకపోయినా, ఆమిర్ ఖాన్‌తో చేస్తున్న ఈ కొత్త సినిమా ఆయనకు, ముఖ్యంగా బాలీవుడ్‌లో ఒక మంచి విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.