Ramcharan: మెగా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రామ్ చరణ్ ఒకరు ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన విషయం మనకు తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ రామ్ చరణ్ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ విధంగా చరణ్ తన సినిమా పనులలో బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత విషయాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా తన చెల్లెలి విషయంలో కానీ తన భార్య కూతురి విషయంలో కూడా ఈయన ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే నేడు నిహారిక పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తన చిట్టి చెల్లికి క్యూట్ బర్త్డే విషెస్ తెలియజేశారు.
ఈ సందర్భంగా నిహారికతో ఉన్న ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. నా ప్రియమైన నిహారికకు పుట్టినరోజు శుభాకాంక్షలు వచ్చే సంవత్సరంలో నువ్వు మరిన్ని సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా రామ్ చరణ్ తన చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక నిహారిక ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిర్మాతగాను నటిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏడాది ఈమె కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ద్వారా నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా నిహారిక భారీ లాభాలను కూడా అందుకున్నారు. మరోవైపు హీరోయిన్ గా కూడా నటిస్తున్నారు. ఇలా నిర్మాతగా నిహారిక మరిన్ని విజయాలను అందుకోవాలని చరణ్ ఆకాంక్షిస్తూ ఈమెకు శుభాకాంక్షలు తెలిపారు.