Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన ఇటీవల నటించిన పుష్ప 2 సినిమా ద్వారా మరింత గుర్తింపు పొందిన విషయం మనకు తెలిసిందే . అయితే ఈ సినిమా కారణంగా అల్లు అర్జున్ వివాదాలు కూడా చిక్కుకున్నారు. అది పక్కన పెడితే ఈయన మాత్రమే సినిమా ద్వారా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఈయనని ఎన్నో కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలి అంటూ సంప్రదిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న అల్లు అర్జున్ తాజాగా
థమ్స్ అప్ కూల్ డ్రింక్ ను కూడా ప్రమోట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో అలాగే టెలివిజన్ లో కూడా వైరల్ అవుతుంది.ఒకప్పుడు ఈ బ్రాండ్ కి మెగా చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత పోకిరి సినిమా నుండి మహేష్ బాబు చేతుల్లోకి ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన యాడ్స్ కాంట్రాక్టు వెళ్ళింది.
గత ఏడాది వరకు ఈ బ్రాండ్ కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.ఇప్పుడు ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల్లోకి వెళ్ళింది. పుష్ప 2 మూవీ విడుదలకు ముందు ఆయన ‘థమ్స్ అప్’ కాంట్రాక్టు కి ఒప్పుకున్నాడు. విడుదల తర్వాత ఈ యాడ్ టీవీ లో టెలికాస్ట్ అవ్వడం మొదలు పెట్టింది. ఇక ఈ కాంట్రాక్టులో భాగంగా ఒక్క వీడియో చేయడం కోసం అల్లు అర్జున్ ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటివరకు ఏ యాక్టర్ కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదని తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ ఈ యాడ్ కోసం ఐదు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని సమాచారం. ఇలా ఒక్క యాడ్ వీడియో కోసం 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటేనే ఈయన క్రేజ్ ఏంటో అక్కడే స్పష్టం అవుతుంది.