Danush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఒకప్పుడు కేవలం తమిళ సినిమాలు మాత్రమే చేస్తున్న ధనుష్ ప్రస్తుతం డైరెక్టర్ తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల సార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక త్వరలోనే ఈయన కుబేర అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా పలు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తున్నటువంటి ధనుష్ ఓ బయోపిక్ సినిమాలో కూడా నటించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఇలా బయోపిక్ సినిమాలు రావడం సర్వసాధారణం ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు క్రీడా రంగానికి చెందిన వారి బయోపిక్ సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ధనుష్ సైతం ఓ బయోపిక్ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తుంది. మరి ఈయన నటిస్తున్న ఆ బయోపిక్ సినిమా ఎవరిది అనే విషయానికి వస్తే చంద్రబాబు దని సమాచారం. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం కాదండోయ్..జోసెఫ్ పనిమయదాస్ చంద్రబాబు అనే నటుడి బయోపిక్ సినిమాలో ధనుష్ నటించిన బోతున్నారు.
ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా యాక్టర్‌గా.. ప్లేబ్యాక్ సింగర్‌గా.. డైరెక్టర్‌గా రాణించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలాంటి ఒక లెజెండరీ యాక్టర్ బయోపిక్ సినిమాలో నటించడానికి ధనుష్ సిద్ధమయ్యారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి కానీ ఇప్పటివరకు ధనుష్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు.