70 ఏళ్ల నటుడితో పడుచు హీరోయిన్ ప్రేమాయణం.. సినిమా స్టంట్ అంటున్న నెటిజన్స్!

యంగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఒక హీరోయిన్ ఎంతో భవిష్యత్తు ఉండి కూడా 70 ఏళ్ల నటుడితో ప్రేమలో పడిందనే వార్తలు ఒక్కసారిగా ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇక అతడితో పెళ్లికి కూడా సిద్ధం అయ్యిందంటూ వార్తలు రావడంతో ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఎవరు ఆ యంగ్ బ్యూటీ, ఎవరు ఆ 70 ఏళ్ల నటుడు, వాళ్ళ ప్రేమకథ ఏమిటి అనేది చూద్దాం.

31 ఏళ్ల నటి శివంగి వర్మ ప్రముఖ నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో ఫోటోను పంచుకుంది. ఆ ఫోటోను షేర్ చేస్తూ “ప్రేమకు వయసు, పరిమితులు లేవు” అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేయడంలో ట్రోల్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రేమకు కళ్ళు ఉండవంటారు కానీ ఈ హీరోయిన్ చేస్తున్న పని చూస్తే మాత్రం నిజంగా ప్రేమ గుడ్డిది అనక మానరు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

ప్రేమకు కావాల్సింది వయసు కాదు.. డబ్బు. నీ తండ్రి వయస్సుతో సమానమైన వ్యక్తితో ప్రేమలో పడడానికి అసలు నీకు సిగ్గు లేదా? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే కొందరు మాత్రం వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారని, అందులో స్టిల్ సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని చెప్తున్నారు. అయితే ఇందులో ఏది నిజం ఏది అబద్దం అనేది ఎవరికి తెలియదు. ఈ విషయంపై సదరు నటులు ఇద్దరూ స్పందించలేదు.

ఇక శివంగి వర్మ విషయానికి వస్తే.. భారతీయ నటిగా, ఎంటర్టైనర్ గా పేరు దక్కించుకున్న ఈమె హిందీ సోప్ ఒపేరాలు, టెలివిజన్ యాడ్ లలో నటిస్తూ పాపులారిటీ అందుకుంది. సోనీ పాల్ లో ప్రసారమైన టెలివిజన్ షో హమారీ సిస్టర్ దీదీ లో మెహర్ పాత్ర పోషించిన ఈమె, ఆ తర్వాత సబ్ టీవీలో బివి ఔర్ మెయిన్ లో మాయా పాత్ర పోషించి మరింత పాపులారిటీ అందుకుంది. ఇక గోవింద్ నామ్‌దేవ్ అనేక చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు. ‘బ్యాండిట్ క్వీన్’, ‘సర్ఫరోష్’, ‘సత్య’ వంటి సినిమాలతో ఫేమస్ అయ్యాడు.