Rashmika: సినీ నటి రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2 సినిమా విజయోత్సవంలో ఎంతో బిజీగా ఉన్నారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 1500 కోట్ల కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉన్నారు. తక్కువ సమయంలోనే రష్మిక కూడా పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక తన వ్యక్తిగత విషయాల ద్వారా కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈమె ప్రేమ గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక విజయ్ దేవరకొండ తో కలిసి గీతాగోవిందం అనే సినిమాలో మొదటిసారి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి రొమాన్స్ పీక్ స్టేజ్ లో ఉంది. అలాగే ఇద్దరు కలిసి మరోసారి డియర్ కామ్రేడ్ అనే సినిమాలో కూడా నటించారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎప్పుడూ కూడా వీరు తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదు కానీ పరోక్షంగా ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టు హింట్ ఇచ్చారు. ఇకపోతే తాజాగా రష్మిక మందన్న తన జీవిత భాగస్వామి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీవిత భాగస్వామి ఎలా ఉండాలో తెలియజేశారు.
జీవితంలోని ప్రతి దశలో తనకు తోడుగా ఉండాలని.. అన్ని వేళలా భద్రతను ఇవ్వాలని కష్ట సమయంలో తనకు సపోర్ట్‌గా ఉండేవారు తనకు భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు. ఒకరిపై మరొకరికి బాధ్యత ఉన్నప్పుడే వారిద్దరు జీవితాంతం కలిసి ఉంటారని తెలిపారు. తన దృష్టిలో ప్రేమ అంటే జీవిత భాగస్వామిని కలిగి ఉండడమేనని తెలిపారు. జీవితంలో ప్రతి ఒకరికి తోడు అవసరమని తోడు లేకపోతే ఆ జీవితానికి ప్రయోజనమే ఉండదని ఈ సందర్భంగా రష్మిక జీవిత భాగస్వామి గురించి ఆ వ్యక్తి ఎలా ఉండాలి అనే విషయాల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.