AP: తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చొరబడి చిల్లర పనులు చేయటం వైసీపీ నేతలకు మొదటి నుంచీ అలవాటేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి పార్థసారథి అన్నారు. గతంలో నారా లోకేశ్ వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇలానే వైసీపీ నేతలు కొడాలి నాని వల్లభనేని వంశీ చొరబడ్డారని తెలిపారు. ఇటీవల నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చర్చలకు కారణమైంది.
నిజానికి ఈ విగ్రహం పార్టీలతో సంబంధం లేకుండా గౌడ కులస్తులందరూ కూడా ఏర్పాటు చేసిన విగ్రహం కావడంతో పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు ఇక్కడ పాల్గొన్నారు అయితే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యే గౌతమ్ శిరీష, మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. వీరితో పాటు వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్ కూడా పాల్గొన్నారు.
ఇలా జోగి రమేష్ పాల్గొనడంతో నారా లోకేష్ ఈ విషయంపై సీరియస్ కావడంతో మంత్రి పార్థసారధి క్షమాపణలు చెప్పారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన ఈ కార్యక్రమానికి తాను ఆలస్యంగా వెళ్లాను కాని అప్పటికే అక్కడ జోగి రమేష్ ఉన్నారని తెలిపారు. ఉదయం కార్యక్రమంలో పాల్గొని పోకుండా సాయంత్రం తాను వచ్చే వరకూ జోగి రమేశ్ ఉద్దేశపూర్వకంగా ఉన్నారని పార్థసారథి తెలిపారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ కార్యక్రమ నిర్వహణలో పాల్గొనలేదని చెప్పారు. వ్యక్తిగతంగా జోగి రమేశ్ కు, తనకు ఎలాంటి బంధమూ లేదని తెలిపారు.
ఇలా అనుకోకుండా జరిగిన ఈ ఘటన ద్వారా బాధపడిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా తాను మరోసారి క్షమాపణలు చెబుతున్నాను అంటూ పార్థసారథి తాజాగా వైసీపీ నేతల గురించి వారు చిల్లర రాజకీయాలు చేస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు పట్ల వైకాపా నాయకులు కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.