Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెనుదుమారం లేపుతుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లారు. అయితే ఈయన రావడంతో పెద్ద ఎత్తున జరిగింది. ఈ తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించారు. ఇక ఆమె కుమారుడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉంది.
ఇలా వారికి ఇలాంటి పరిస్థితి రావడానికి పరోక్షంగా అల్లు అర్జున్ కారణమని ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు చేరుకోవడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకుందని పోలీసులు ఈయనని అరెస్టు చేశారు ఇలా పోలీసులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఏకంగా జైలు వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారు.
ఇకపోతే అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ పోస్టులు చేస్తున్నారు అలాగే సీ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే ఆయన కక్ష సాధింపు చర్యగా అల్లు అర్జున్ అరెస్టు చేయించారు అంటూ తెలంగాణ సర్కారుకు పోలీసులకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు.
ఇలా అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారో వారిపై కేసులో నమోదు కావటం గమనార్హం. ఇలా అల్లు అర్జున్ అభిమానులను తెలంగాణ పోలీసులు అలాగే తెలంగాణ సర్కార్ టార్గెట్ చేస్తూ కేసులు నమోదు చేయటంతో మరింత మంది అభిమానులు పోలీసు తీరుపై రేవంత్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాల్సి ఉంది.