Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎంతోమంది సెలబ్రిటీలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న తర్వాత రాజకీయాలలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రాజకీయాలలోకి వచ్చిన ఎంతో మంది సెలెబ్రెటీలు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే వారందరిని స్ఫూర్తిగా తీసుకొని మెగాస్టార్ చిరంజీవి సైతం రాజకీయాలలోకి అడుగుపెట్టారు.
చిరంజీవి స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఇలా ఈ పార్టీ స్థాపించిన చిరంజీవి ఎన్నికలలో పోటీ చేశారు కానీ అనుకున్న స్థాయిలో మెజారిటీ మాత్రం రాలేదు. అయితే ఈయన కొద్ది రోజులకు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా కొంతకాలం పాటు రాజకీయాలలో కొనసాగిన చిరంజీవి తనకు రాజకీయాలు సెట్ అవ్వవు అని తెలిసి తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు.
ఈ విధంగా చిరంజీవి రాజకీయాలలోకి రావడానికి స్ఫూర్తి ఎవరో కాదు ఆయన నటించిన సినిమా అనే తనని రాజకీయాలలోకి వచ్చేలా చేసిందని తెలుస్తుంది. మరి చిరంజీవికి స్ఫూర్తిగా నిలిచిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే ఆ సినిమా మరేదో కాదు ముఠామేస్త్రి అని చెప్పాలి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ముఠామేస్త్రి సినిమాలో మార్కెట్లో కూలీగా పని చేస్తూ.. ఏకంగా చిరంజీవి మంత్రి స్థాయికి ఎదుగుతాడు. ముఠామేస్త్రి సినిమా ప్రభావం వల్లే చిరుకి ముఖ్యమంత్రి అవ్వాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు.
ఈయన అనుకున్న విధంగానే పార్టీ పెట్టడం ఎన్నికల ప్రచారాలలో పాల్గొనడం ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది కానీ సినిమాలలో మంత్రి అయినంత సులువుగా నిజజీవితంలో కాలేమనే సత్యాన్ని గ్రహించారు. దీంతో తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసిన చిరు తిరిగి సినిమాలలో కొనసాగుతూ ఉన్నారు. ఇక త్వరలోనే ఈయన విశ్వంభర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.