Suma: తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా అందరికీ ఎంతో సుపరిచితమయ్యారు సుమ. ఏదైనా ఒక సినిమా ఈవెంట్ జరగాలి అంటే తప్పనిసరిగా అక్కడ సుమ ఉండి తీరాల్సిందే అంతలా ఈమె పాపులర్ అయ్యారు. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా నటుడిగా అందరికీ తెలిసిందే. రాజీవ్ కనకాల ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు కానీ ఇటీవల కాలంలో ఈయన ఎక్కువగా చనిపోయే పాత్రలలో నటిస్తున్నారు.
ఇలా ప్రతి సినిమాలో కూడా రాజీవ్ కనకాల పాత్ర సినిమాని కీలక మలుపు తిప్పుతూ చనిపోయే పాత్రలో కనిపిస్తున్నారు. ఇక గత కొంతకాలంగా రాజీవ్ కనకాల నటిస్తున్న సినిమాలలో ఆయన పాత్రకు ప్రాధాన్యత ఉండి బ్రతికున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది విరూపాక్ష సినిమా అని చెప్పాలి. ఈ సినిమాలో రాజీవ్ కనకాల పాత్రకు మంచి ప్రాధాన్యత లభించింది అంతేకాకుండా ఈయన చివరి వరకు కూడా చనిపోరు.
తాజాగా ఇదే విషయం గురించి డైరెక్టర్ కార్తీక్ దండు సుమ పై సెటైర్లు వేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. అల్లరి నరేష్ నటించిన బచ్చలి మల్లి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు ఈయనతో పాటు బింబిసార డైరెక్టర్ వశిష్ట కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చారు. అయితే వీరిద్దరి పేర్లు సుమా కన్ఫ్యూజ్ అయ్యారు.దీంతో ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు ఫన్నీ కామెంట్స్ చేశాడు. ‘ఈ మధ్య కాలంలో మీ భర్త రాజీవ్ కనకాలకి బ్రతికున్న పాత్ర ఇచ్చింది నేనే. మీకు ఆ మమకారం కూడా లేదు’ అంటూ దర్శకుడు కార్తీక్ దండు .. సెటైర్లు వేశారు దీంతో సుమ మాట మాట్లాడకుండా ఈ ఒక్క విషయంలో నేను మిమ్మల్ని ఏమీ అనలేక పోతున్నాను దీనిని కూడా నేనొక కాంప్లిమెంట్ గా తీసుకుంటాను అంటూ ఫన్నీగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఈ మధ్య కాలంలో రాజీవ్ కనకాలకి చనిపోని పాత్రనిచ్చింది నేనే: కార్తీక్ దండు#KarthikDandu #RajeevKanakala #BachhalaMalli #AllariNaresh pic.twitter.com/Kvxp9w1qLX
— Filmy Focus (@FilmyFocus) December 17, 2024