Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున బాక్సాఫీస్ వద్ద 1500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా ఒక టాలీవుడ్ చిత్రం ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం ఇదే మొదటిసారి ఇక ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ లభించడంతో రష్మిక క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది.
ఇక ఈ సినిమా సుమారు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం అయిందని ఈ సినిమా 1500 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తుంది .ఇకపోతే రష్మిక ఈ సినిమా కోసం భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి ఇప్పటివరకు తన కెరీర్లో ఎక్కడ కూడా ఈమె ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదని సమాచారం.
ఈ సినిమా కోసం మాత్రమే రష్మిక ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకొని సంచలనం సృష్టించారు. సౌత్ ఇండస్ట్రీలో నయనతార మినహా ఎవరు కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదు కానీ రష్మిక మాత్రం ఇలా పది కోట్లు రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ రష్మిక ఖర్చు చేసేసారని తెలుస్తోంది.
ఈమె పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కువగా ముంబైలోనే నివసించాల్సి వస్తుంది. ఈ తరుణంలోని ఎప్పటినుంచో తాను ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారట. ఓ బిజీ ఏరియాలో ఈమె తనకు నచ్చిన ఒక అందమైన ఫ్లాట్ కొనుగోలు చేశారని ఇప్పటికే ఆ ఫ్లాట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయిందని సమాచారం. ఇలా పుష్ప సినిమా రెమ్యూనరేషన్ తో రష్మిక ముంబైలో ఫ్లాట్ కొన్నారని తెలుస్తుంది