Sai pallavi: ఈ జీవితంలో సాయి పల్లవి ఆ కోరికలను తీర్చుకోలేదా… ఏంటి ఆ తీరని కోరికలు?

Sai pallavi: సినీ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ప్రేమమ్ సినిమా ద్వారా ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సాయి పల్లవి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి తక్కువ సమయంలోనే ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. ఎలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా బలమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ విజయం అందుకుంటున్నారు.

ఇక ఇటీవల అమరన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్టు సినిమాని తన కథలు వేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్న సాయి పల్లవికి మూడు కోరికలు ఉన్నాయట అయితే ఆ మూడు కోరికలు తన జీవితంలో ఎప్పటికీ తీరలేవని తెలుస్తోంది. అయితే ఈ మూడు కోరికలను ఈమె పలు సందర్భాలలో బయటపెట్టారు మరి సాయి పల్లవికి తీరని ఆ మూడు కోరికలు ఏంటి అనే విషయానికి వస్తే..

సాయి పల్లవికి బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్‌తో నటించాలని అనుకుందట. కానీ, ఇర్ఫాన్ ఖాన్ కోలన్ ఇన్ఫెక్షన్ కారణంగా 53 సంవత్సరాల వయసులోనే మరణించారు. దీంతో ఈమె కోరిక ఎప్పటికీ నెరవేరుదని చెప్పాలి ఇర్ఫాన్ ఖాన్ మరణించిన సమయంలో ఈమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇక ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మీరు ఎవరితోనైనా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఎవరితో ఆ టైం స్పెండ్ చేస్తారనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సాయి పల్లవి ఎవరు ఊహించని విధంగా రతన్ టాటా గారితో తాను సమయం గడపాలని కోరుకుంటాను అంటూ సమాధానం చెప్పారు. ఆయన మంచితనం ఆయన జంతువులను కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకునే విధానం నాకు ఎంతగానో నచ్చింది అందుకే ఎప్పుడైనా తనతో కలిసి కాస్త సమయం గడపాలని కోరుకుంటున్నాను తెలిపారు. అయితే ఆ కోరిక కూడా నెరవేరకుండా పోయింది ఇటీవల రతన్ టాటా మరణించిన విషయం తెలిసిందే.

ఇక ఈమె నటించిన ప్రేమమ్ సినిమాకు అవార్డు రావడంతో ఈ అవార్డు వేడుకలో భాగంగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సాయి పల్లవి గురించి ఎంతో గొప్పగా చెప్పడమే కాకుండా తనతో కలిసి నటించాలని ఉందని ఆయన తెలియజేశారు అయితే పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఇలా పునీత్ రాజ్ కుమార్ గారితో నటించే కోరిక కూడా ఇకపై ఎప్పటికీ నెరవేరదనే చెప్పాలి. ఇలా సాయి పల్లవి జీవితంలో ఈ మూడు తీరని కోరికలుగానే ఉండిపోయాయని తెలుస్తోంది.