AP: పెన్షన్ల పై సర్కార్ కీలాక నిర్ణయం… నోటీసులు జారీ చేయనున్న ప్రభుత్వం?

AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా పెన్షన్ పెంచుతూ తలుపుల జారీచేశారు. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే పెంచిన పెన్షన్ ను అందజేశారు అయితే తాజాగా పెన్షన్ల కోత విధిస్తున్న విషయం మనకు తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా అనర్హులు కూడా పెన్షన్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇలా పెన్షన్ కు అర్హత లేకపోయినా కొంతమంది తప్పుడు సర్టిఫికెట్లను తీసుకువచ్చి పెన్షన్ అందుకుంటున్నారని అలాంటి వారందరికీ పెన్షన్ కట్ చేయాలి అంటూ ఇటీవల చంద్రబాబు నాయుడు కలెక్టర్ సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే.డిసెంబర్ 9,10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో అనర్హులను గుర్తించారు. దాదాపు 11వేల పెన్షన్లను తనిఖీ చేస్తే అందులో 563మంది అర్హత లేకున్నా పెన్షన్లు అందుకుంటున్నట్టు తనిఖీ బృందాలు గుర్తించాయి.

ఇలా ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లను తీసుకున్నారో అలాంటి వారందరికీ కోత విధించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.రాష్ట్రంలో దాదాపు 3.5లక్షల మంది అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల ముఖ్యమంత్రికి వివరించారు.ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ఎవరైతే అనర్హులు అయినప్పటికీ పెన్షన్ అందుకుంటున్నారు అలాంటి వారికి నోటీసులు అందజేయాలని అలాగే నిర్దిష్ట గడువులోగా వారి నుంచి సమాధానాలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో నోటీసులకు స్పందించని వారి పెన్షన్లను హోల్డ్ లో పెట్టాలని స్పష్టం చేసింది. ఇదిలావుండగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల కేటగిరీలో పెద్ద సంఖ్యలో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు సెర్ప్‌ అధికారులు గుర్తించారు.