Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. భారీగా పెరిగిన పుష్ప 2 కలెక్షన్స్.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

Allu Arjun: పుష్ప 2 విడుదల సమయంలో తొక్కిసలాటలో భాగంగా అభిమాని మరణించడంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఇక ఈ విషయంలో పరోక్షంగా అల్లు అర్జున్ కారణమని అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు ఆయనని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇలా పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేయడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చలకు కారణమైంది.

అల్లు అర్జున్ పోలీసుల అరెస్టు చేయడంతో వెంటనే తనని కోర్టుకు హాజరు పరచడం కోర్టు తనకు రిమాండ్ విధించడం జరిగింది అనంతరం హైకోర్టులో వాదోపవాదనలు విన్న తర్వాత న్యాయస్థానం అల్లు అర్జున్ కు మద్యంతర బెయిలు ప్రకటించింది. అయితే తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ కావడం పట్ల కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జమిలి ఎన్నికల సవరణ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందుకు వెళ్లిన నేపథ్యంలో బీజేపీపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..బీజేపీకి రాజ్యాంగపై నమ్మకం లేదన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. రాజ్యసభలో మాట్లాడిన తీరు సరిగ్గా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

జమిలి సవరణ బిల్లు ప్రవేశ పెట్టే వేళ.. దాదాపు 20 మంది బీజేపీ ఎంపీలు సభకు హాజరుకాలేదని గుర్తు చేశారు. అయినా జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే.. మూడు వంతుల సభ్యుల ఆమోదం పొందవలసి ఉంది కానీ లోక్ సభ, రాజ్య సభ స్పీకర్లు బిజెపి నాయకులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.పోలీస్ అరెస్టయితే తమ రేటింగ్ పెరుగుతుందని కొందరు నేతలు భావిస్తున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

అల్లు అర్జున్ అరెస్టు అనంతరం పుష్ప -2 సినిమా కలెక్షన్స్ ఇంకో రూ.100 నుంచి150 కోట్లు పెరిగాయని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే పుష్ప 3 లెవెల్ లో అతనికి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు అంటూ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.