Prabhas: బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ కావడంతో అప్పటినుంచి ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలా ప్రభాస్ వరుస సినిమాల ద్వారా ప్రస్తుతం కెరియర్ పట్ల ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రభాస్ సినిమాల్లో నటించడం కోసం ఎంతో మంది సెలబ్రిటీలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ప్రభాస్ పక్కన నటిస్తే తమకు కూడా అదే స్థాయిలో క్రేజ్ వస్తుందని ఎంతోమంది కొన్ని సందర్భాలలో రెమ్యునరేషన్ లేకుండా కూడా ప్రభాస్ సినిమాలో కనిపించడం కోసం ఆరాటపడుతుంటారు. అలాంటిది ప్రభాస్ పక్కన హీరోయిన్గా నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోరు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ప్రభాస్ పక్కన నటించే అవకాశం రావడంతో తాను నటించనని నిర్మహమాటంగా చెప్పేశారట.
మరి ప్రభాస్ సినిమాని రిజెక్ట్ చేసినటువంటి ఆ అన్ లక్కీ హీరోయిన్ ఎవరు అనే విషయాన్నికొస్తే ఆమె మరేవరో కాదు సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. సందీప్ రెడ్డి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం స్పిరిట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా సందీప్ రెడ్డి మృణాల్ ను సంప్రదించారట అయితే ఆమె మాత్రం ఈ సినిమాలో నటించడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు తనకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చిన నేను మాత్రం నటించనని తేల్చి చెప్పేశారు.
ఈ విధంగా మృణాల్ ప్రభాస్ సినిమాలో నటించక పోవడానికి కారణం ప్రభాస్ కాదు డైరెక్టర్ సందీప్ రెడ్డి అనే చెప్పాలి .సందీప్ రెడ్డి సినిమాలు అంటే ఎలా బోల్డ్ వైల్డ్ సన్నివేశాలు ఉంటాయో మనకు తెలిసిందే. అలాంటి బోల్డ్ సన్నివేశాలలో తాను నటించలేనని, తేల్చి చెప్పేశారట. అలా ప్రభాస్ తో నటించే అవకాశాన్ని ఆమె స్వయంగా వదులుకున్నారని తెలుస్తుంది.