ప్రస్తుతం టాలీవుడ్ సినిమానే ఇండియన్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. మన హీరోలు నార్త్ మార్కెట్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నారు. మన దర్శకులు సౌత్ సినిమాలతోనే నార్త్ లో కోట్లు కొల్లగొడుతున్నారు. దీంతో బాలీవుడ్ స్టార్స్ కూడా మన దర్శకులతో కలిసి వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ కూడా మన దర్శకులతో కలిసి వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
అలా సౌత్ బాట పడుతున్న బాలీవుడ్ స్టార్స్ కు మాస్ టింజ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు సౌత్ మేకర్స్.తాజాగా మరో డైరెక్టర్ సైతం అదే చేస్తున్నారు. మరి ఈ మాస్ రచ్చ ఏంటో చూద్దామా..? బాలీవుడ్ హ్యాపెనింగ్ స్టార్ రణబీర్ కపూర్ కూడా సౌత్ డైరెక్టర్ తో కలిసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇక తాజాగా సౌత్ లో కమర్షియల్ మూవీ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు గోపిచంద్ మలినేని కూడా బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమా జాట్.
గదర్ 2 తో బౌన్స్ బ్యాక్ అయిన సన్నీ, ఆ జోరును కంటిన్యూ చేసేందుకు సౌత్ ఫ్లేవర్ ను నమ్ముకున్నారు. నయా ఇన్నింగ్స్ లో షారూఖ్ ఖాన్‌ను ఊరమాస్ రోల్ లో చూపించిన హిట్ కొట్టారు అట్లీ. ఈ డైరెక్టర్ టేకింగ్ కు ఫిదా అయిన షారూఖ్ అదే కాంబోలో మరో మూవీ చేసేందుకు ఎదురుచూస్తున్నారు. గతంలో బాహుబలితో రాజమౌళి, సాహూతో సుజీత్ సైతం బాలీవుడ్‌కు ఊర మాస్ ఎలా ఉంటుందో టేస్ట్ చూపించారు. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులకు మరో ప్రపంచాన్ని చూపించాయి.
సాహూకి సౌత్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కంటే నార్త్ నుంచి వచ్చిన రెస్పాన్సే ఎక్కువ .అట్లీ శిష్యుడు కలీస్ కూడా బాలీవుడ్ కు మాస్ యాక్షన్ ను కొత్తగా చూపించే ప్రయత్నాల్లో ఉన్నారు. సౌత్ లో సూపర్ హిట్ అయిన తెరి సినిమాను హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. అయితే తమిళంలో కన్నా హిందీలో హీరో క్యారెక్టర్ మరింత వైలెన్స్ గా చూపించబోతున్నాడంట ఈ డైరెక్టర్.