Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఊహించని షాప్ ఇచ్చిన వాలంటీర్లు.. ఏమైందంటే?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వాలంటీర్లు ఊహించని షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్రదుమారం రేపాయి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ కారణంగా వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి మహిళల వ్యక్తిగత వివరాలను నమోదు చేసి కొంతమంది అగంతకులకు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది మహిళలు బాలికలు అదృశ్యం అయ్యారని ఈయన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

ఇలా పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పై కేసులు కూడా నమోదు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పట్ల కేసు నమోదు అయినప్పటికీ వెంటనే ఎన్నికలు రావడంతో ఈ కేసులు పూర్తిగా మరుగున పడిపోయాయి.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి గురించి పట్టించుకునే వాళ్లే లేరు అంతేకాకుండా వాలంటీర్లను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొనసాగిస్తామని వారికి ఐదు వేలు కాకుండా పదివేల రూపాయల వేతనం చెల్లిస్తామని కూటమి నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో తెలియజేశారు.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తిరిగి విధులలోకి తీసుకొని విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో వాలంటీర్లు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అయితే గతంలో వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పుడు ప్రముఖ లాయర్, జై భీమ్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, మహిళా వాలంటీర్ల తరపున హైకోర్టులో పిటిషన్ వేశారు.పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలకు సంబంధించి అప్పట్లో ఎలాంటి ఆధారాలూ చూపలేదు. తనకు ఢిల్లీలోని నిఘా వర్గాల నుంచి ఈ విషయం తెలిసిందని చెప్పారే తప్ప ఎలాంటి ఆధారాలు చూపించలేదు.

ప్రస్తుతం ఈ పిటిషన్ కోర్టు పరిశీలన చేసి పవన్ కళ్యాణ్ ను కనుక ఆధారాలు అడిగితే ఆయన తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.లేదంటే, ఆయనకు ఇది చట్టపరంగా సమస్య కాగలదు. ఐతే.. చాలా కేసులు ఇలాగే దర్యాప్తు దశలోనే ఉంటూ, పెండింగ్‌లో ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. ఈ కేసూ ఆ లిస్టులో చేరినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుతం అధికారం వారిదే కనుక ఈ కేసు కూడా పెండింగ్ లిస్టులోకి చేరడంలో ఆశ్చర్యం లేదని చెప్పాలి.