బాధగానే ఉంటుంది కదా!

వెయ్యి కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం, పదమూడు జిల్లాలు, సుందరమైన అయిదారు నగరాలు, ముప్ఫయి ఏడుమంది జడ్జీల సామర్ధ్యం కలిగిన ఉన్నత న్యాయస్థానం, ప్రతిరోజూ బెంచ్ ముందుకొచ్చే పదుల కొద్దీ కేసులు, విచారణలు,  అయిదుకోట్లమంది జనాభాను ప్రభావితం చెయ్యగలిగిన తీర్పులు, పది పన్నెండు ధర్మాసనాలు, వేలాదిమంది అధికారులు, సిబ్బంది, డజన్ల సంఖ్యలో జిల్లా కోర్టులు, తాలూకా కోర్టులు,  హంగులు, ఆర్భాటాలు,  రామలక్ష్మణులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు అంటూ  ప్రతిరోజూ భజనలు చేసే క్షుద్రమీడియా, ఒత్తాసులు పలికే ప్రతిపక్షనేత…ప్రపంచ ప్రసిద్ధి పొందిన దేవాలయాలు, కృష్ణా, గోదావరి లాంటి మహానదులు కలిగిన సువిశాలమైన రాష్ట్రం నుంచి కేవలం నలభై లక్షల జనాభా కలిగి, ముగ్గురు జడ్జీలో ప్రథముడిగా వ్యవహరించాల్సిన కొండ ప్రాంతపు రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు ఎవరికైనా బాధగానే ఉంటుంది.   అక్కడ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఉండవు.  భూకబ్జాలు చేసినా, అవినీతికి పాల్పడినా  గాగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం రాదు.  పచ్చమీడియా గొంతు చించుకుని చేసే స్తోత్రగానాలు వినిపించవు.  తాము న్యాయస్థానాలకు వెళ్తున్నప్పుడు రెండు చేతులు జోడించి, మోకాళ్ళ మీద కూర్చుని అభివందనాలు చేసే కోట్లాధిపతులైన రైతులు కనిపించరు. ఎంత బాధాకరం!
How painful it is to go to court
How painful it is to go to court

మంచి చెడులు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు 

ఎవరైనా కలెక్టర్, ఒక తాసిల్దార్,  ఒక మంత్రి, ఒక పోలీసు అధికారి, ఒక న్యాయమూర్తి, ఒక ప్రధానోపాధ్యాయుడు, ఒక ప్రిన్సిపాల్,  సంస్థల్లో పనిచేసే  బదిలీమీద లేక పదవీవిరమణ చేసి వెళ్లే సమయంలో తన సర్వీసులో ప్రజలకు, సంస్థకు, జిల్లాకు, రాష్ట్రానికి  మేలు చేకూర్చే సంస్కరణలు ఏమి చేపట్టారు, ఏమి పూర్తి చేశారు అని ప్రజలు బేరీజు వేసుకుని వారి పోక పట్ల కన్నీరు పెట్టుకోవడమో లేక మెటికలు విరవడమో జరుగుతుంది.  

అప్రతిష్ట మూటగట్టుకుని…

కానీ జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ రాకేష్ కుమార్ ఎపి హైకోర్టు నుంచి వెళ్తూ బోలెడంత అప్రతిష్టను మూటగట్టుకుని వెళ్లిపోయారు.  ఎపి హైకోర్టు చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా నిందితులను కాపాడే ఆదేశాలను ఇచ్చి జస్టిస్ మహేశ్వరి, ఇలాంటి ఆర్డర్ ను మీ వృత్తిజీవితంలో చూసారా అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే వ్యాఖ్యానించేవిధంగా అనైతిక వ్యాఖ్యలు చేసి జస్టిస్ రాకేష్ కుమార్ తమ ఏడాది సర్వీసులో అపఖ్యాతి పాలై విషణ్ణవదనాలతో నిష్క్రమించడం ప్రజాస్వామ్యప్రియులకు, సమాన న్యాయం కాంక్షించే ఎవరికైనా బాధాకరమే.  

సుప్రీంకోర్టులో పరాభవాలు 

సాధారణంగా మాజీ న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తుల గురించి విశ్లేషకులు, రాజకీయ వ్యాసకర్తలు, నిపుణులు పత్రికల్లో వ్యాసాలు వ్రాసేటపుడు ఫలానా న్యాయమూర్తి ఫలానా గొప్ప తీర్పు ఇచ్చి న్యాయదేవతను రక్షించారని, న్యాయవ్యవస్థ మీద విశ్వాసాన్ని పెంచారని ఉటంకిస్తుంటారు.  కానీ, జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ రాకేష్ కుమార్ ల గురించి ఏదైనా మంచి ఆర్టికల్ వ్రాయాలనుకున్నప్పుడు ఏమి ప్రస్తావించాలి?  ప్రభుత్వం ఏ సంస్కరణ చేబట్టినా అడ్డుకున్నారని,  ప్రభుత్వ లాయర్ల వాదనలు వినడానికి కూడా కొన్ని సందర్భాల్లో తిరస్కరించారని, ప్రభుత్వం మీద దుర్వ్యాఖ్యలు చేశారని, చివరకు అవినీతి నిరోధకశాఖ పెట్టిన కేసుల్లో నిందితుల పేర్లను కూడా బయట పెట్టరాదని ఆంక్షలు విధించారని,  సుప్రీమ్ కోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నారని, ఏ న్యాయమూర్తి కూడా తన వృత్తిలో ఆశించని  విధంగా సుప్రీంకోర్టుతో వాతలు పెట్టించుకున్నారని,  కేసుకు ఏమాత్రం సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి ముఖ్యమంత్రిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి ప్రజలతో,  మేధావులతో కూడా  ఛీకొట్టించుకున్నారని వ్రాయటం తప్ప ఏమి మిగిలింది?  వీరిచ్చిన తీర్పు చరిత్రాత్మకం అనిపించేవిధంగా ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నదా?  

ప్రజాప్రయోజనాలే ముఖ్యం కావాలి 

ఎవ్వరికీ పదవులు శాశ్వతం కాదు.  అదృష్టం కొద్దీ లభించే స్వల్పకాలిక పదవుల్లో ఉండి ప్రజల మనస్సులో నిలిచేవిధంగా ఏమి చేశామని ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి.  తాము వెళ్లిన తరువాత కూడా తమ గురించి ప్రజలు గౌరవంగా, ఘనంగా చెప్పుకోవాలి.  పదవులు తమకు అలంకారం కాక తాము పదవులకు అలంకారంగా భాసించాలి.  అది లేనినాడు నపుంసకుడికి రంభ దొరికిన సామెతే అవుతుంది.   
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు