TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ఇచ్చిన కోర్టు… ఉప ఎన్నికలు తప్పవా?

TG: అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వలసలు వెళ్లడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఇప్పటికి అటు తెలంగాణలోనే ఇటు ఆంధ్రాలోను ఎంతోమంది అధికార పార్టీలోకి వలసలు వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాటు తెలంగాణలో పరిపాలన కొనసాగించారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

ఈ క్రమంలోనే చాలామంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్లారు. ఏడుగురు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆయన పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు అనర్హత పిటిషన్లతో పాటు కలిపి విచారిస్తామని కోర్టు వెల్లడించింది. అలాగే ఎవరైతే పార్టీ మారారో వారందరిపై కూడా అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గికి అందజేయాలని ధర్మాసనం అనర్హతపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ వాదనను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేశారు.

ఈ విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కనక వేస్తే తప్పనిసరిగా ఉప ఎన్నికలు వస్తాయన్న చర్చ కూడా జరుగుతుంది. ఇటీవలే కెసిఆర్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈయన పలువురు పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు అనంతరం తాను కొడితే దెబ్బ గట్టిగా ఉంటుందంటూ కూడా ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చారు ఇలాంటి తరుణంలోనే పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కెసిఆర్ గట్టిగానే కొట్టబోతున్నారని స్పష్టమవుతుంది.