పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 ప్రారంభానికి సమయం సమీపిస్తుండగా, ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంచైజీ ఒక ప్రచార వీడియోతో వివాదంలో చిక్కుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన వాయిస్‌ను తమ మస్కట్‌కు జతచేసి రూపొందించిన వీడియో ఇప్పుడు తీవ్ర విమర్శలకు లోనవుతోంది. లావుగా ఉన్న డిజైన్‌లో ఉన్న మస్కట్‌కి రోహిత్ మాటలు కట్టబెట్టి బాడీ షేమింగ్ చేసిందని భారత అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో వ్యతిరేక స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్‌ను శరీర పరంగా కించపరచడం తగదు, ఇది క్రికెట్ విలువలకు విరుద్ధమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “వరుసగా రెండు ఐసీసీ టైటిల్స్ గెలిపించిన నాయకుడిపై ఈ స్థాయిలో తక్కువ కోణంలో వ్యాఖ్యలు చేయడం ఏమిటి?” అంటూ అనేకమంది ప్రశ్నిస్తున్నారు. పీఎస్ఎల్‌కు బదులు నాణ్యమైన ఆటపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
ఇటీవల టీమిండియా, ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం రోహిత్ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలే ఆ వీడియోలో వాడడం భారత క్రికెట్ అభిమానులకు అసహనం కలిగించింది. ఇందులో హాస్యం కన్నా అవమానం ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు. బాడీ షేమింగ్ లాంటి తక్కువ స్థాయి ప్రచారం పాక్ లీగ్ ప్రొఫైల్‌ను మరింత దిగజార్చుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ తరహా వ్యవహారాలు పీఎస్ఎల్ క్రెడిబిలిటీపై మచ్చ వేసేలా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ అభిమానులు ఆటను కాకుండా ఈజీ టార్గెట్ చేసుకునే ప్రచారాన్ని అసహ్యించుకుంటున్నారు. రోహిత్ శర్మ లాంటి ప్రపంచ స్థాయి కెప్టెన్‌పై ఈ తక్కువ ప్రదర్శనకు సున్నితంగా స్పందించకపోయినా, అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే ఝలక్ ఇస్తున్నారు.
https://x.com/MultanSultans/status/1902288089545896172?t=W5xnKD9XN7DFYJ7ljBDvcQ&s=19