తమిళ సినీ పరిశ్రమలో యాక్షన్ స్టైల్ లో బాక్సాఫీస్ కు సరికొత్త దారిని చూపించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా తన కెరీర్‌లో మరో బిగ్ ఆఫర్ అందుకుంటున్నట్లు తెలుస్తోంద. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’లతో తన సత్తా చాటిన లోకేష్, ఇప్పుడు ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌తో మూడు సినిమాల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ డీల్‌తో ఆయన దక్షిణాది పరిశ్రమల మధ్య కలిసిన వారధిగా మారనున్నాడు.
ఈ మూడు ప్రాజెక్టులను కూడా పాన్ ఇండియా లెవెల్‌లో నిర్మించేందుకు ప్లాన్ జరుగుతోంది. అయితే, ఒక సినిమాకు రామ్ చరణ్‌ను హీరోగా తీసుకునే ప్రణాళికలో ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ‘RC16’, ‘RC17’ లైన్‌లో ఉన్న మెగా పవర్‌స్టార్, RC18ని లోకేష్ డైరెక్షన్‌లో చేసేలా అవకాశం ఉంది. ఈ సినిమా కూడా యాక్షన్ థ్రిల్లర్ తరహాలో ఉంటుందని ప్రచారం జోరుగా ఉంది. ఇది ఎల్సీయూ యూనివర్స్‌లో భాగమా, లేక పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌నా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
మిగిలిన రెండు ప్రాజెక్టుల్లో ఒకటి కార్తీతో ‘ఖైదీ 2’, మరొకటి సూర్య ప్రధాన పాత్రలో ‘రోలెక్స్’ స్పిన్ ఆఫ్‌గా ఉండే అవకాశం ఉంది. ‘విక్రమ్’లో సూర్య నటనకు ఆడియన్స్ నుంచి అద్భుత స్పందన వచ్చిన నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడు చిత్రాలూ డిఫరెంట్ జానర్లలో ఉండేలా స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. KVN బ్యానర్‌తో ఈ డీల్ ఫైనల్ కావడం ద్వారా లోకేష్ కనగరాజ్ క్రియేటివ్ స్పేస్ మరింత విస్తరించనుంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చరణ్ కాంబో కారణంగా ఈ డీల్ తెలుగులోనూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.