కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం… గ్రహణ సమయం ఎప్పుడంటే?

సాధారణంగా పౌర్ణమి అమావాస్యల రోజున మనకు సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇక ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజు ఏర్పడే చంద్రగ్రహణం రెండవ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో ఎక్కువ సమయం పాటు గ్రహణకాలం ఉంటుంది. ఇక చంద్రగ్రహణం నవంబర్ 8వ తేదీ ఏర్పడింది.

నవంబర్ 8వ తేదీ చంద్రోదయంతోనే గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 05:32 గంటలకు మొదలైన చంద్రగ్రహణం సాయంత్రం 06:18గంటలకు పూర్తి అవుతుంది. ఇక చంద్రగ్రహణం భారతదేశంలో తూర్పు భాగాలలో మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది మిగిలిన ప్రాంతాలలో పాక్షిక చంద్రగ్రహణం కనపడనుంది. ఇలా కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడటంతో పలు ఆలయాలను కూడా మూసివేయనున్నారు.

ఇక చంద్ర గ్రహణం రోజు గ్రహణకాలంలో ఎవరు కూడా ఎలాంటి ఆహార పదార్థాలను భుజించకుండా ఉపవాసంతో ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఉండాలి. గ్రహణ కాలం పూర్తి అయిన తర్వాత ఇంటిని మరోసారి శుభ్రం చేసి స్నానం చేసుకొని పూజా కార్యక్రమాలను చేయాలి. ఇక గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు గ్రహణకాలంలో బయట తిరగకపోవడం మంచిది.