మామూలుగా సమయంలో దేవాలయాలను మూసివేయడం మనం తరచుగా గమనిస్తూనే ఉంటాం. ఈ సమయంలో దేవాలయాల తలుపులన్నీ మూసేస్తారు. కానీ ఇలా ఎందుకు మూసివేస్తారు? దాని వెనుక ఉన్న రీజన్ ఏంటి అన్నది చాలామందికి తెలియదు.. మరి ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నవ గ్రహాలలో రాహువు, కేతువులను అశుభాలకు సంకేతంగా భావిస్తారు. సూర్యుడిని రాహువు మింగేసినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అలాగే చంద్రుడిని కేతువు మింగినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
గ్రహణాలు ఏర్పడే సమయాన్ని చెడు కాలంగా భావిస్తారు. పురాణాల ప్రకారం, సూర్యచంద్రులను రాహు, కేతువులు మింగినప్పుడే గ్రహణాలు ఏర్పడతాయనే విషయం మనందరికీ తెలిసిందే. గ్రహణం సమయంలో భూమిపై నేరుగా అతి నీల లోహిత కిరణాలు పడటం వల్ల మనకు చెడు ప్రభావం కలుగుతుంది. పురాణాల ప్రకారం, ఈ సమయంలో దేవాలయంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేవాలయాల్లోని విగ్రహాలు తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో దేవాలయాల తలుపులను పూర్తిగా మూసివేస్తారు.
హిందూ గ్రంథాల ప్రకారం, గ్రహణాల సమయంలో సూర్య, చంద్రులు అసాధారణ ప్రతికూల శక్తిని విడుదల చేస్తారు. దీంతో ఆలయాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఆ ప్రతికూల శక్తులు దేవాలయాల్లో ప్రవేశించకుండా తలుపులను మూసివేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి బలహీనపడే అవకాశం ఉంటుంది.