చంద్రగ్రహణం రోజు పాటించాల్సిన నియమాలు.. చేయకూడని పనులు ఇవే?

సాధారణంగా పౌర్ణమి అమావాస్య రోజులలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడటం సర్వసాధారణం అయితే గత అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడగా తిరిగి 15 రోజులకే చంద్రగ్రహణం ఏర్పడనుంది. కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడటంతో ఈ గ్రహణ ప్రభావం ఇండియాలో కూడా కనిపిస్తుంది. అయితే కొన్ని ప్రాంతాలలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడగా మరికొన్ని ప్రాంతాలలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.అయితే చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తూ కొన్ని పనులను చేయకపోవడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది మరి ఆ పనులు నియమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

నవంబర్ 8వ తేదీ చంద్రగ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో మనం ఎలాంటి ఆహార పదార్థాలను వండకుండా అలాగే తినకూడదని పండితులు చెబుతున్నారు.ఇకపోతే దేవుడి గదికి కూడా తలుపులు మూసేసి ఎలాంటి పూజా కార్యక్రమాలను చేయకూడదు అదేవిధంగా గ్రహణ సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు. గ్రహణ సమయం మొత్తం మన ఇష్ట దైవాన్ని మనసులో ఆరాధిస్తూ ఉండాలి.ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉండాలి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎలాంటి పదునైన వస్తువులతో పనులు చేయకూడదు.

ఇక గ్రహణ సమయంలో మనం ఏదైనా ఆహార పదార్థాలను ముందుగా తయారు చేసి పెట్టుకుంటే ఆహార పదార్థాలలో తులసి ఆకులు వేయడం మంచిది. చంద్రగ్రహణం పూర్తి అయిన అనంతరం ముందుగా స్నానమాచరించి అనంతరం ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లు మొత్తం గంగాజలం చల్లి అనంతరం అన్నదానం చేయడం ఎంతో శుభప్రదం. ఇలా గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలతో పాటు చేయకూడని పనులకు కూడా దూరంగా ఉండాలి.