తులసి మొక్కతోపాటు ఈ రెండు మొక్కలు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉన్నట్లే…?

మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు దేవుళ్లతో పాటు కొన్నిరకాల పవిత్రమైన చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ఇలా పవిత్రంగా భావించే మొక్కలను ఇంట్లో ఉంచి పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలా ప్రతి ఒక్కరూ ఇంట్లోంచి పూజించే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి ప్రజలందరూ తులసి మొక్కను ఇంట్లో ఉంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రజల విశ్వాసం. అయితే తులసి మొక్కతో పాటు ఇంట్లో మరొ రెండు రకాల మొక్కలను ఉంచటం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. తులసి మొక్కతో పాటు ఇంట్లో పెంచవలసిన ఆ రెండు మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి మొక్కను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ప్రతిరోజు ఇంట్లో తులసి మొక్కకు పూజ చేయటం వల్ల లక్ష్మీ సమేతుడయిన ఆ మహావిష్ణువు అనుగ్రహం లభించి ఇంట్లో సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు ఉంటాయి. అలాగే ఇంటి ఆవరణంలో తులసి మొక్కతో పాటు శమీ వృక్షం, నల్ల దతురా మొక్కలను పెంచడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు దూరం అయిపోతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం నల్లదాతురా మొక్కలో పరమేశ్వరుడు కొలువై ఉంటాడని ప్రజల నమ్మకం. అలాగే శమీ వృక్షంలో బ్రహ్మ, విష్ణువులు కొలువై ఉంటారు. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.

ఈ విధంగా తులసి మొక్కతో పాటు నల్ల దతురా, శమీ వృక్షాన్ని కూడా ప్రతిరోజు పూజించడం వల్ల ఆ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఆ ఇంటి పై ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ మూడు మొక్కలను ఇంట్లో పెంచితే ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అలాగే ఆ ఇంటి పై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా కాపాడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి సాధించాలి అంటే ఈ మొక్కలను పూజించడం ఎంతో మంచిది. ఈ మూడు మొక్కలను ఇంట్లో ఉంచి పూజించటం వల్ల ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ మొక్కలను పూజించడం వల్ల పితృ దోషాలు కూడా దూరం అవుతాయి.