KCR: చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించిన కేటీఆర్.. కెసిఆర్… ఖుషీ అవుతున్న తెలుగు తమ్ముళ్లు!

KCR: బిఆర్ఎస్ అధినేత మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకను పురస్కరించుకొని చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనగా మారాయి. ఇలా ఈ తండ్రి కొడుకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల కురిపించడంతో తెలుగు తమ్ముళ్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకొచ్చిన హైటెక్ సిటీ సహా.. ఐటీ అభివృద్ధిని తాము కొనసాగించామని చెప్పారు. ఇలా ప్రత్యర్థులు సైతం తమపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే వచ్చే కిక్కే వేరు అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కెసిఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించిన విషయం మనకు తెలిసిందే.తెలంగాణ సెంటిమెంట్ పండించడం కోసం అప్పుడూ, ఇప్పుడూ కూడా చంద్రబాబును తెలంగాణకు విలన్ గా చూపించేందుకు నానా తంటాలూ పడ్డారు.2019 ఎన్నికలలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ అంటూ ఎగతాళి చేసిన కేసీఆర్, జగన్ హయాంలో అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసిన సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.

ఇలా ఒకప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు ప్రశంసలు కురిపించడంతో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.