Revanth Reddy: రాజకీయ నాయకులకు సినిమా సెలబ్రిటీలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. ఈ క్రమంలోనే అభిమానులు వాటిని ఎంతో అందంగా ఇష్టపడుతూ ఉంటారు. వారికి సంబంధించి ఏదైనా ముఖ్య ఘటన జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది కార్యకర్తలు రాజకీయ నాయకులను ఆహ్వానించడం జరుగుతుంది. ఈ క్రమంలోని ఓ అభిమాని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని ఆయనకు వీలైనప్పుడే నేను పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకుంటానని రాసినటువంటి లెటర్ ప్రస్తుతం సంచలనగా మారింది.మేకలతండాకు చెందిన భూక్యా గణేష్‌కు ఇటీవల పెళ్లి నిశ్చితార్థం అయింది. కాగా, గణేష్‌కు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అన్నా, సీఎం రేవంత్‌రెడ్డి అన్నా చాలా ఇష్టం. అందుకే తన పెళ్లికి రేవంత్ రెడ్డి రావాలని కోరుకున్నారు.
ఆదివారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు వినతిపత్రం అందించాడు. దీంతో అతడి వినతిపై ‘రెస్పెక్టెడ్ సీఎం సార్, ప్లీజ్ కైండ్లీ అటెండ్ ది మ్యారేజ్.. వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్ ఇన్ సింగరేణి మండల్, ప్లీజ్ ఎనీ డేట్ డు ఫిక్స్‌అని రాసి ఉన్న లెటర్ పై సంతకం చేసిన ఎమ్మెల్యే సీఎం ఆఫీస్‌కు పంపించారు. కాగా గణేష్ పెళ్లికి సీఎం వస్తారా? లేదా అనేది చర్చలకు కారణమైంది.
సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే తాను పెళ్లి చేసుకుంటాననీ అభిమాని గణేష్ భీష్ముంచుకొని కూర్చున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు వీలవుతుందో చెబితే అదే రోజే తాను ముహూర్తం పెట్టుకుంటానని గణేష్ భావిస్తున్నారు. మరి ఈ లెటర్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది.