చిన్నపిల్లలకు ఆయిల్ మసాజ్ చేస్తున్నారా.. ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే!

చిన్న పిల్లలకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వారి కండరాలను బలోపేతం చేయడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మంచి నిద్రకు సహాయపడుతుంది. ఆయిల్ మసాజ్ పిల్లల కండరాలను బలంగా మరియు దృఢంగా చేస్తుంది. మసాజ్ రక్త ప్రసరణను పెంచి, పిల్లల ఆరోగ్యానికి దోహదపడుతుంది. మసాజ్ పిల్లల ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు వారికి విశ్రాంతిని ఇస్తుంది.

మసాజ్ పిల్లలకు మంచి నిద్రకు సహాయపడుతుంది అదే సమయంలో ప్రశాంతంగా నిద్రపోతారు. ఆయిల్ మసాజ్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గ్యాస్, కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మసాజ్ తల్లి మరియు బిడ్డల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. అయితే పిల్లలకు మసాజ్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోవాలి.

పిల్లలకు మసాజ్ చేసేటప్పుడు వెచ్చని మరియు నిశ్శబ్ద ప్రదేశాన్ని ఎంచుకోవాలి. పిల్లల చర్మంపై నూనెను సరిగా పూసి మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. తల, మెడ, భుజాలు, తొడలు, కాళ్ళు, చేతులను మసాజ్ చేయడం ద్వారా పిల్లలకు సులువుగా హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని చెప్పవచ్చు.

పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి మసాజ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. మసాజ్ చేసిన తర్వాత పిల్లలకు స్నానం చేయించడం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఇది పిల్లల చర్మానికి మంచిదని మరియు చర్మం సంబంధిత సమస్యలకు సహాయపడుతుందని చెప్పవచ్చు. నువ్వుల నూనెతో మసాజ్ చేస్తే యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న ఈ నూనె చర్మానికి తేమ నిలుపుకోవడంలో సహాయపడుతుంది.