YS Sharmila: విజయవాడలో ఇంటిని కొనుగోలు చేసిన వైఎస్ షర్మిల… కారణం ఏంటో తెలుసా?

YS Sharmila: ఏపీ పీసీసీఅధ్యక్షురాలు షర్మిల ఇకపై కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో బిజీ కాబోతున్నారని తెలుస్తుంది.పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ఎంపికైన తర్వాత పెద్దగా పార్టీ వ్యవహారాలలో ఎక్కడ చురుగ్గా కనిపించలేదు ఈమె నిరంతరం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కావడంతో ప్రత్యర్థులను ఎదుర్కోవడం ఆంధ్రప్రదేశ్లో తన పార్టీని బలపరుచుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.

ఇలా హైదరాబాదులో ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ వ్యవహారాలను చూసుకోవడంలో ఇబ్బంది పడుతున్న షర్మిల ఇటీవల విజయవాడలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక్కడే ఉంటూ ఈమె కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూనే మరోవైపు పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా విజయవాడ నుంచి రాజకీయాలు చేయడం కోసం ఈమె ఓ ఖరీదైన విల్లా కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఇటు పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ మరోవైపు తన కుటుంబంతో కలిసి ఉండే విధంగా ఈమె ఈ విల్లాని కొనుగోలు చేశారట. సుమారు 8 కోట్లు ఖర్చు చేసి పోరంకి రోడ్లో కామినేని హాస్పిటల్ సమీపంలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లాను షర్మిల కొనుగోలు చేశారని, అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి ఈమె విజయవాడకు షిఫ్ట్ అవ్వబోతున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై షర్మిల దృష్టి పెట్టారు. వైయస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వస్తున్నటువంటి కీలక నేతలతో షర్మిల సంప్రదింపులు చేస్తూ వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం కోసం కృషి చేస్తున్నారని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధినాయకత్వం షర్మిలపై విశ్వాసం ఉంచిందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఉగాది తర్వాత విజయవాడ నుంచే రాజకీయం నడపడానికి షర్మిల రెడీ అవుతున్నట్టు సమాచారం.