బ్యాక్ పెయిన్ తో నరకం అనుభవిస్తారా.. ఈ చిట్కాలు పాటిస్తే సమస్యకు చెక్!

వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఒకటి లేదా రెండు రోజులు విశ్రాంతి తీసుకుని నెమ్మదిగా పని మొదలు పెట్టడం ద్వారా వెన్ను సంబంధిత సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. వెన్ను నొప్పి ఉన్న చోట మంచు లేదా వేడి ప్యాక్‌లను ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.

వ్యాయామం వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈత, నడక, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయడం ద్వారా వెన్ను నొప్పిని సులువుగానే దూరం చేసుకోవచ్చు. కూర్చున్నప్పుడు మరియు నిలబడినప్పుడు సరైన భంగిమను నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. వెన్నెముకను నేరుగా ఉంచడానికి ప్రయత్నించడం ద్వారా కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చు.

మృదువైన, కుషన్ ఉన్న షూస్ ధరించడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉంటాయి. మసాజ్ థెరపీ కండరాల ఉద్రిక్తతను తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పవచ్చు. డాక్టర్ సూచించిన నొప్పి నివారణ మందులను వాడటం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు మరియు నిద్రపోయినప్పుడు సరైన భంగిమను నిర్వహించడంతో పాటు వెన్నెముకను నేరుగా ఉంచడానికి ప్రయత్నించాలి.

బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు వెన్నెముకను వినియోగించకుండా కాళ్లను ఉపయోగిస్తే మంచిది. పని ప్రదేశంలో ఒక సౌకర్యవంతమైన కుర్చీని వినియోగించడం ద్వారా వెన్నెముక సంబంధిత సమస్యల బారిన పడే ఛాన్స్ అయితే ఉండదు. బ్యాక్ పెయిన్ సమస్యలతో బాధ పడే వాళ్లు ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏ మాత్రం మంచిది కాదు.