రక్తహీనత రాకుండా ఉండాలంటే, మీరు ఐరన్, విటమిన్ బ్12, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా వైద్యుడిని సంప్రదించి, రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా రక్తహీనతను ప్రారంభంలోనే గుర్తించి, చికిత్స చేయించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. క్యారెట్, బచ్చలికూర, ఆకుకూరలు, మాంసం, , గుడ్లు, సోయాబీన్స్ వంటి ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
విటమిన్ బీ12 లోపం తలెత్తకుండా పాలు, పెరుగు, మాంసం, చేపలు, గుడ్లు వంటి ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఆకుకూరలు, పండ్ల రసాలు, గింజలు, నట్స్ వంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కొన్ని ఆహారపు అలవాట్లు శరీరంలో ఐరన్ శాతాన్ని తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటి ఆహారాలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది.
రక్తహీనత లక్షణాలు ఉంటే లేదా రక్తహీనత చరిత్ర ఉంటే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడంతో పాటు వైద్యుడు సూచించిన మందులను తరచూ తీసుకోవాలి. అలసట, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, చర్మం పాలిపోవడం, కాళ్ళలో నొప్పులు, తలతిరగడం, త్వరగా అలసిపోవడం లక్షణాలు రక్తహీనత లక్షణాలు అని చెప్పవచ్చు.
అన్ని రకాల రక్తహీనత నివారణ సాధ్యం కాదు. ఐరన్-రిచ్ ఫుడ్స్‌తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, విటమిన్ బీ12 సమృద్ధిగా ఉన్న ఆహారాలను చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఐరన్‌తో పాటు ఎ, బి 12, బి 3, బి 6, సి, డి, ఇ విటమిన్లు, కాపర్, జింక్ లాంటి మినరల్స్ లోపించినా ఎనీమియా రావొచ్చు. అందుకే అన్ని విటమిన్లు ఉండే పోషకాహారం తీసుకోవాలి