Allu Aravind: ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. పుష్పరాజ్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇలా వరుసగా ఘటనలతో అల్లు ఫ్యామిలీ సతమతమవుతున్న నేపథ్యంలో తాజాగా ఒక ఊహించని ఘటన ఘటన అందర్నీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అదేమిటంటే అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి చేయడంతో పాటు ఇంట్లో ప్రవేశించి అక్కడ ఉన్న పూల కుండీలు మొత్తం ధ్వంసం చేశారు..
ఈ ఘటనతో ఒక్కసారిగా అల్లూ ఫ్యామిలీ భయపడిపోయింది. OU JAC కి చెందిన వారంటూ పలువురు విద్యార్థులు సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై రాళ్లు, టమాటాలతో దాడి చేసి ఇంట్లోకి దూకి పూల కుండీలను అక్కడ ఉన్న కొన్ని వస్తువులను పగలకొట్టారు. ఇంటి ముందు ధర్నా చేసారు. దీంతో పోలీసులు పలువురిని ఈ ఘటనలో అరెస్ట్ చేశారు.
అయితే తాజాగా అల్లు అరవింద్ ఈ సంఘటన పై స్పందించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. మా ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారు. మా ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు పెట్టారు.
ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరూ కూడా ఇలాంటి దుశ్చర్యలు ప్రేరేపించకూడదు. ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అందుకే సమయమనం పాటిస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఇప్పటికీ ఈ ఘటనలో బాగా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దానికి సంబంధించిన వివరాలను పోలీసులు అల్లు అరవింద్ అని అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది.