AP: కాపు ఉద్యమ నేతం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభం జగన్ మోహన్ రెడ్డికి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ పై గతంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఈయన జనసేన పార్టీలోకి వస్తారని అందరూ భావించినప్పటికీ ఈయన మాత్రం పవన్ గురించి విమర్శలు చేస్తూ జగన్ పంచన చేరారు దీంతో కాపులంతా ఈయనకు వ్యతిరేకంగా మారారు.
ఇలా కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముద్రగడ పద్మనాభం పై కూడా ఎన్నో రకాల విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జనసేన కార్యకర్త మద్యం మత్తులో నేడు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ట్రాక్టర్ తో ముద్రగడ ఇంటిపై దాడికి వెళ్లారు .దీంతో ఆయన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్నటువంటి కారు కొంత భాగం ధ్వంసం అయింది.
ఇలా కారుతో కాసేపు బీభత్సం సృష్టించిన యువకుడు జై జనసేన అంటూ నినాదాలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ముద్రగడ ఇంటిపై దాడి చేసినటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా ముద్రగడ ఇంటిపై దాడి చేసినటువంటి వ్యక్తి పేరు గని శెట్టి గంగాధర్ అని వెల్లడించారు.
పోలీస్ విచారణలో భాగంగా ఈయన కొన్ని విషయాలను వెల్లడించారు తనకు కొంతమంది 50000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పడంతోనే తాను ముద్రగడ ఇంటిపై దాడి చేశానని గంగాధర్ వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడాలని ప్రేరేపించింది ఎవరు ఏంటి అనే విషయాలపై పోలీసులు విచారణ చేయిస్తున్నారు .ఈ విషయం తెలుసుకున్నటువంటి కొంతమంది వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లి తనని పరామర్శించడమే కాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్లు కూడా చేస్తున్నారు.