Nagababu: చంద్రబాబు లేని రాజకీయం లేదు… చర్చలకు కారణమైన నాగబాబు ట్వీట్!

Nagababu: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసినటువంటి ఒక ట్వీట్ ప్రస్తుతం పలు చర్చలకు కారణం అవుతుంది. ఈయన రాజకీయాలలోకి వచ్చిన తర్వాత రాజకీయాల పరంగా ఎదగడం కంటే కూడా చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడును తన అజాత శత్రువుగా ఈయన భావించేవారు. ఇలా చంద్రబాబు గురించి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచిన నాగబాబు ఇప్పుడు మాత్రం చంద్రబాబు అంటే అమితమైన ప్రేమ గౌరవాలను చూపిస్తున్నారు.

గత ఎన్నికలలో పొత్తులో భాగంగా జనసేన పార్టీ కూడా టిడిపితో కలిసి పోయింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నాగబాబు చంద్రబాబు నాయుడు పై ఎంతో గౌరవాన్ని చూపిస్తున్నారు. ఇకపోతే నాగబాబుకు సైతం ఎమ్మెల్సీగా పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా చంద్రబాబునాయుడు తన 75వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నాగబాబు చేసినటువంటి ట్వీట్ చర్చలకు కారణమైంది. గతంలో చంద్రబాబు నాయుడు గురించి తానేమి మాట్లాడలేదు అనే విధంగా నాగబాబు చంద్రబాబు పై గౌరవాన్ని చూపిస్తూ పోస్ట్ చేయటంతో ఇది కాస్త సంచలనంగా మారింది. చంద్రబాబు గారి పట్టుదల నన్ను ఆశ్చర్యపరుస్తుంది. అసెంబ్లీలో ఆయనను అవమానిస్తున్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. గౌరవంగా తిరిగి అడుగుపెట్టారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యక్తిగత దూషణల కారణంగా మీడియా ముందు ఏడ్చినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది.

స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లినా అతను విసిగిపోలేదు. చంద్రబాబు నిజమైన ఛాంపియన్, కాలం సవాళ్లను తట్టుకుని రాజనీజ్ఞుడిగా ఉన్నత స్థాయికి వెళ్లారు. చంద్రబాబు అధ్యాయం లేని రాజకీయ పాఠం లేదు అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఇలా ఈ ట్విట్ చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన నాగబాబు ఇప్పుడు పొత్తు పెట్టుకోవడంతో ఆయనపై గౌరవం చూపుతున్న నేపథ్యంలో అందరూ షాక్ అవుతున్నారు.