మనం నిత్యం ఉపయోగించే వస్తువులను ఉప్పు కూడా ఒకటి. ప్రతి ఒక్కరి వంట గదిలో ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పును కేవలం వంటల్లో మాత్రమే కాకుండా వాస్తు ప్రకారం గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఉప్పుకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం ఉప్పును ఉపయోగించి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టవచ్చు. అదే విధంగా పూర్వం నుంచి ఉప్పును లక్ష్మీ దేవితో పోల్చుతారు. అందుకే ఉప్పుకు కాలు తగలకూడదని, చేతితో మరొకరికి ఇవ్వకూడదని పెద్దలు అంటూ ఉంటారు. కాగా ఉప్పుతో ఇంటిని తుడవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు.
మరి ఉప్పును ఇంకా ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. అంతే కాకుండా వైవాహిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. అదే విధంగా ఇంటి యజమాని జాతకంలో ఉండే శుక్ర దోషాలు పోతాయి. ఆర్థిక సంక్షోభం నుంచి కూడా త్వరగా బయట పడవచ్చు.
ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల అప్పుల నుంచి బయట పడి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఇంట్లో ప్రశాంతత, సుఖ సంతోషాలు కూడా నెలకొంటాయి. తగాదాలు వంటివి ఏర్పడకుంటా ఉంటాయి.