పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి తొమ్మిది సంవత్సరాలైంది. ఈ తొమ్మిదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీలు బలోపేతం కాగా వైసీపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడుతున్నా ప్రజల్లో జనసేనపై పాజిటివ్ ఒపీనియన్ కలగడం లేదు. పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పులే ఈ పరిస్థితికి కారణమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు సర్వేల ఫలితాలలో సైతం జనసేనను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏపీలో 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా జనసేనకు పెద్దగా ప్రయోజనం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జనసేనకు ఇన్‌చార్జ్‌లను కూడా నియమించుకోలేని పరిస్థితి ఉండటంపై నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ మారాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతున్న విషయంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు సైతం అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం కూడా లేదని పవన్ ఇలాగే వ్యవహరిస్తే పార్టీకి ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీడీపీ సైతం జనసేనతో కలిసి పోటీ చేస్తే నష్టమే తప్ప లాభం ఉండదని భావిస్తుండటం గమనార్హం.
జనసేనతో కలిసి పోటీ చేస్తే జనసేనకు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లను ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వడం వల్ల జనసేన ఆ స్థానాలలో బలమైన అభ్యర్థులను నిలబెట్టని పక్షంలో టీడీపీ నష్టపోవాల్సి ఉంటుంది. టీడీపీ జనసేన విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి. ఏపీ రాజకీయాలు ప్రస్తుతం ప్రజల మధ్య హాట్ టాపిక్ అయ్యాయనే చెప్పాలి.