Viva Harsha: ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు ఎంతో మంచి క్రేజ్ ఉంటుంది. వారు చేసే ప్రతి ఒక్క పని కూడా సమాజంపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుందనే సంగతి మనకు తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సెలబ్రిటీలు కాస్త మంచి సమాచారాన్ని సమాజానికి అందజేయడం ఎంతో అవసరం. అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టి కొన్నిసార్లు సెలబ్రిటీలు చేసే పనులు తీవ్రస్థాయిలో విమర్శలకు కారణం అవుతూ ఉంటాయి.
తాజగా టాలీవుడ్ ఓ కమెడియన్ చేసిన పని కూడా ఇలాంటి విమర్శలకు కారణం అవుతుంది. యూట్యూబర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వైవా హర్ష ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు అయితే తాజాగా ఈయన నడిరోడ్డుపై తన భార్యతో కలిసి రొమాన్స్ లో మునిగి తేలుతూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఇలా తన భార్యపై ఉన్న ప్రేమను ఈయన తెలియజేస్తూ నడి రోడ్డుపై ఇలా లిప్ లాక్ పెడుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా హర్ష తన సతీమణి అక్షరను తీసుకుని అమెరికా ట్రిప్ వేశాడు. ప్రస్తుతం న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఆయన ప్రఖ్యాత టైమ్ స్క్వేర్‌లో భార్యకు ఘాటుగా లిప్‌లాక్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సెలబ్రిటీలు ఇలా చేయడం పట్ల సమాజానికి ఒక తప్పుడు సంకేతం అందించినట్టు అవుతుందని ఇలాంటి విషయాలలో సెలబ్రిటీలు కాస్త చూసుకొని వ్యవహరించాల్సి ఉంటుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం హర్ష రొమాంటిక్ పర్సన్ అంటూ కూడా ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.