Amitabh Bachchan: కొడుకుపై షాకింగ్ కామెంట్స్ చేసిన అమితాబ్ బచ్చన్.. షో కి పిలిచి తప్పు చేశానంటూ!

Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ భారీగా సంపాదిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ, మరోవైపు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఈ తరం హీరోలను ఆశ్చర్య పరుస్తున్నారు. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

దాదాపుగా 16 సీజన్లను పూర్తిచేసుకున్న ఈ షోకి మొదటి నుండి బిగ్ బీనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడం అన్నది నిజంగానే షాకింగ్ విషయం అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ షో కి చాలా మంది సినీ సెలెబ్రిటీస్ వచ్చారు. తాజాగా అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ వచ్చారు. తన తదుపరి సినిమా ఐ వాంట్ టు టాక్ కి సంబందించిన ప్రమోషన్స్ కోసం వచ్చి ఈ సినిమా గురించి అనేక విషయాలను తెలిపారు అభిషేక్.
ఇక ఈ షోలో అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. సాయంత్రం డిన్నర్ సమయంలో అందరం ఒకే దగ్గర కలుస్తాము. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పిల్లలందరూ నాన్నలా చేస్తుంటారు.

సాట్ క్రోర్ అంటూ అందరూ పిల్లలు నాన్నని ఇమిటేట్ చేస్తుంటారు. అక్కడితో ఆగరు సాట్ క్రోర్ సాట్ క్రోర్ అని పదే పదే నాన్నని ఏడిపిస్తుంటారు అని చెప్పడంతో అక్కడున్న వారందరూ నవ్వారు. అప్పుడు బిగ్ బి..అసలు నిన్ను ఈ షోకి పిలిచి తప్పు చేశాను అని నవ్వుతూ అన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియో పై అభిమానులు ఫన్నీగా స్పందిస్తున్నారు.