AP CM: జనసంద్రంగా మారిన నారా వారిపల్లె… రామ్మూర్తినాయుడికి టీడీపీ నేతలు నివాళులు!

AP CM: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నిన్న ఏఐజి ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. రామ్మూర్తి నాయుడు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఇలా తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నటువంటి రామ్మూర్తి నాయుడు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన గత వారం రోజులుగా హైదరాబాద్లోనే ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇలా ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో నిన్న కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి లోకేష్ తమ కార్యకలాపాలన్నింటినీ రెండు రోజులపాటు రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు.

ఇలా హైదరాబాద్ వెళ్లినటువంటి లోకేష్ చంద్రబాబు తన తమ్ముడి భౌతికకాయాన్ని చూస్తూ ఎమోషనల్ అవ్వడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడి బాబాయ్ మరణం పై ఎమోషనల్ పోస్టులు చేశారు.. అనంతరం రామ్మూర్తి నాయుడు కుమారులైనటువంటి గిరీష్ రోహిత్ లను చంద్రబాబు నాయుడు ఓదార్చారు.

ఇకపోతే చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయినటువంటి నారావారి పల్లెలోనే తన తమ్ముడి అంత్యక్రియలను నిర్వహించాలని భావించారు అక్కడే తన తల్లితండ్రుల అంత్యక్రియలు కూడా జరగడంతో తన తమ్ముడి రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు కూడా అక్కడే జరగాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని నారావారిపల్లెకు తీసుకురావడంతో నారావారిపల్లె జనసంద్రంగా మారింది.

ఇప్పటికే నారా కుటుంబ సభ్యులందరూ నారావారిపల్లికి చేరుకొని తన తమ్ముడికి నివాళులర్పించారు. ఇక పలువురు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులకు కూడా అక్కడికి చేరుకొని రామ్మూర్తి నాయుడుకి నివాళులు అర్పిస్తున్నారు మరి కాసేపట్లో ఈయన అంత్యక్రియలు కూడా ప్రారంభం కానున్నాయి.