Allu Arjun: పాట్నా గడ్డ పైన అడుగుపెట్టిన అల్లు అర్జున్.. బన్నీ దెబ్బకు అవాక్కైన బీహార్ ప్రభుత్వం!

Allu Arjun: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అయితే ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం పాట్నాకు బయలుదేరారు అల్లు అర్జున్.

ఈ టైలర్ లంచ్ ఈవెంట్ బీహార్ లో గ్రాండ్గా జరగనుంది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈవెంట్ కు అల్లు అర్జున్, రష్మిక హాజరు అవుతున్నారు. పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వద్ద ఇప్పటికే భారీగా జనాలు చేరుకున్నారు. ఆ ప్రాంగణం అంతా పుష్పరాజ్ అభిమానులతో నిండిపోయింది.

తాజాగా అల్లు అర్జున్, రష్మిక పాట్నాకు చేరుకున్నారు. అల్లు అర్జున్ కు పాట్నాలో ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ బయటే మీడియా, ఫ్యాన్స్, జనాలు అల్లు అర్జున్ ని చూడటానికి భారీగా తరలి వచ్చారు. ఫుల్ టైట్ సెక్యూరిటీ మధ్య అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లారు.

కాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం భారీ పోలీస్ బందోబస్త్ ను ఏర్పాటు చేయనున్నారు. 900 మంది పోలీసులు, 300 మంది ప్రవైట్ సెక్యూరిటీ ట్రైలర్ లాంచ్ కోసం బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.ఇంతమొత్తంలో పోలీసులను, ప్రవైట్ సెక్యూరిటీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బీహార్ గవర్నమెంట్ ఇవ్వటం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. పుష్పరాజ్ దెబ్బకు బీహార్ ప్రభుత్వం అవాక్కైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప 2 ట్రైలర్ ని విడుదల చేసేసారు మూవీ మేకర్స్.